లక్నవరం ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం : సీతక్క

by Disha Web Desk 23 |
లక్నవరం ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం : సీతక్క
X

దిశ,ములుగు ప్రతినిధి: శుక్రవారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లోని లక్నవరం చెరువు ను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రైతులకు జీవనాధారం అయిన లక్నవరం చెరువు కు త్వరలోనే గోదావరి జలాలు అందించి రెండు పంటలకు నీళ్లు అందిస్తామన్నారు. ఈ వేసవిలో ఎండ తీవ్రత అధికంగా ఉండటం తో అనేక చెరువులు కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోవడం తో రైతులు నా దృష్టికి తీసుకువచ్చారు అని, త్వరలోనే రామప్ప రిజర్వాయర్ నుంచి కాశిందేవి పేట మీదుగా కెనాల్ ద్వారా లక్నవరం చెరువు కు నీటిని మళ్లించి గోవిందరావుపేట మండలాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.

రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలాన కెనాల్ పనులు జరగక ఇప్పుడు రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని, త్వరలోనే కెనాల్ పనులు పూర్తి చేపించి రైతులకు సాగునీరు అందించే విధంగా చొరువ చూపిస్తానని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్, మండల, గ్రామ నాయకులు,కార్యకర్తలు తదితరులు అన్నారు.



Next Story