- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాస్క్ బదులు పెయింటింగ్.. ఫైన్ ఏంటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : కరోనా నివారణకు వ్యాక్సిన్లు వచ్చినప్పటికీ మన వద్ద ఉన్న ప్రాథమిక ఆయుధం మాస్క్. వైరస్ కట్టడికి మాస్క్ ధరించడం ముఖ్యం. కాబట్టి ప్రతీ ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా కొందరు మాస్క్‌ల విషయమై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులు మాస్క్ ధరించడానికి బదులు, అచ్చం అలాగే కనిపించే విధంగా ఫేస్ మీద పెయింటింగ్ వేసుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. ఆ చర్యలేంటి? ఈ ఘటన ఎక్కడ జరిగింది?
ఇండోనేషియాలోని బాలికి చెందిన యువతులు ‘జోష్ పాలర్ లిన్, లీయా’ క్లోజ్ ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లుగా కూడా పాపులర్. వీరికి ఫ్యాషన్ కాన్షియస్ ఎక్కువగా కాగా, మాస్క్ ధరిస్తే తమ అందం తరిగిపోతుందని భావించారేమో తెలియదు కానీ మాస్క్‌కు బదులు ఫేస్‌పై మాస్క్ మాదిరిగా కనిపించేలా బ్లూ కలర్ ఫేస్ పెయింట్ వేయించుకున్నారు. దాంతో వారి ముఖాలు బ్లూ సర్జికల్ మాస్క్ మాదిరిగానే కనిపించాయి. ఇక తమను ఎవరూ గుర్తుపట్టలేరని భావించి, హ్యపీగా షాపింగ్ చేసేశారు. అలా తమ పెయింటింగ్ ట్రిక్‌తో సూపర్ మార్కెట్ నిర్వాహకులను ఫూల్స్ చేశారు. ఈ సంఘటనను ఇద్దరిలో ఒకరు రికార్డు కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియో తమ దృష్టికి రావడంతో అధికారులు సదరు యువతుల గురించి ఎంక్వైరీ చేశారు. జోష్ పాలర్ లిన్ రష్యన్ అని, లీయా తైవాన్ గర్ల్ అని గుర్తించి.. నిబంధనలు ఉల్లంఘించినందుకు వారి పాస్‌పోర్టులను రద్దు చేశారు. కాగా అధికారుల చర్యను ప్రశంసిస్తున్న నెటిజన్లు.. మాస్క్ ధరించడం ప్రాథమిక కర్తవ్యమనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తెరగాలని చెప్తున్నారు.