విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

by Aamani |
విషాదం.. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సుర్జాపూర్ గ్రామానికి చెందిన అమూడగాని ఉషాన్న(38), అతని భార్య లింగవ్వ (32).. మూడు రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాలోని వాగపూర్ గ్రామంలో వారి బంధువుల పెళ్లికి వెళ్లారు. అయితే, లాక్‌డౌన్ మినహాయింపు 10గంటల వరకే ఉండటంతో వారు ఆదివారం ఉదయం తమ ఇంటికి బైకుపై బయలుదేరారు. ఈ క్రమంలో మార్గమధ్యలో నేరడిగొండ హైవేపై బైకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో లింగవ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. ఉషాన్నకు కాలి విరిగింది. వెంటనే స్థానికులు ఉషాన్నను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story