- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పరిచయస్తుడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆమె.. వారం రోజులుగా..
దిశ, ఆత్మకూర్(ఎస్): పరిచయస్తుడని నమ్మి.. అతడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి మహిళ మృతి చెందింది. పోస్టాఫీస్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన ఆమె.. అతడు ఇచ్చిన కూల్ డ్రింక్ తాగి తీవ్ర అస్వస్థతతో ఇంటికి చేరింది. వారం రోజులు చికిత్స పొందిన ఆమె ఆదివారం మృతి చెందింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో చోటుచేసుకుంది. మృతిరాలి కుమారుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆత్మకూర్ (ఎస్) మండలం ఖాసీగూడెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ బీ(45) ఉపాధి హామీ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవిస్తోంది. వారం రోజుల క్రితం ఉపాధి హామీ కూలీ డబ్బులు తీసుకునేందుకు ఏపూర్ పోస్టాఫీస్‌కు వెళ్లింది. ఆమె డబ్బులు తీసుకోని వస్తుండగా పాత పరిచయస్తుడైన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బందోని పాతర్ల పాడ్‌కు చెందిన షేక్ అబ్దుల్లా కలిశాడు. ఆయన గత కొంత కాలంగా రాయి పని చేసుకుంటూ ఏపూర్‌లోనే ఉంటున్నాడు. తిరిగి వెళ్తున్న షేక్ హుస్సేన్ బీకి తాగమని కూల్ డ్రింక్ ఇచ్చాడు. దానిని తాగిన ఆమె కొద్ది సేపటికే అస్వస్థతకు గురైంది. వెంటనే స్థానిక ఆర్ఎంపీ దగ్గర చికిత్స చేయించుకుని ఖాసీగూడెంలోని ఇంటికి చేరుకుంది.
అయితే కూల్ డ్రింక్ తాగిన నాటి నుంచి అనారోగ్యంగా ఉన్న షేక్ హుస్సేన్ బీ ఆదివారం మృతి చెందింది. కాగా షేక్ అబ్దుల్లా కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇవ్వడంతోనే తన తల్లి చనిపోయిందని మృతురాలి చిన్న కుమారుడు షేక్ మస్తాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి ముగ్గురు కుమారులున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆత్మకూర్ (ఎస్) ఎస్ఐ ఎం. లింగయ్య తెలిపారు.