- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బావ మోసం.. న్యాయం చేయాలంటూ మహిళ ఏం చేసిందంటే ?
దిశ నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఓ మహిళ బుధవారం కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన తిప్పర్తి జ్యోతి అనే మహిళ న్యాయం కోసం తిరిగితే అవమానమే ఎదురైందని కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త భాగం భూమి ఇవ్వకుండా వారి అన్న రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై పట్టా చేయించుకున్నాడని దానిపై రెండేళ్ల పాటు పోరాడుతూ గతేడాది తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు తెలిపారు. రెండేళ్ల నుండి అధికారుల చుట్టూ తిరుగుతున్నా వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంది.
భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిపోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని హత్యాయత్నానికి ఒడిగట్టింది. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం గమనించి భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సల్కర్ పేట గ్రామ శివారులో 5.6గుంటల భూమిని తమకు తెలపకుండానే తన బావ వెంకట్ రెడ్డికి పట్టా చేశారని ఇందులో అసలు దొంగ తహసీల్దారేనని బాధితులు ఆరోపించారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్ళామని భూమి వివాదంలో ఉన్న మాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోర్టు సూచించింది. అయినా కౌలుకు ఇవ్వకుండా విత్తనాలు వేయకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇంటికి కూడా రానివ్వడం లేదన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని కలిసినా.. మీ ఊరినుండి ఓట్లు రాలేదు ఎందుకు పట్టించుకోవాలి అని అన్నట్లు ప్రవర్తించారన్నారు. ఈ ఘటనపై స్పందించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆమె సమస్యను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఈ ఘటపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని తహశీల్దార్ నెమిలి అంజిరెడ్డిని ఆదేశించారు. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి సంఘటనలు పాల్పడవద్దని నచ్చజెప్పాడు.