ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ దారుణ హత్య

by Anukaran |   ( Updated:2020-12-27 23:20:21.0  )
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ దారుణ హత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం అర్థరాత్రి మార్చురీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు మహిళ తలపై బండ రాయితో మోదీ దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాల కోసం గాలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. హత్యకు గురైన సదరు మహిళ నగరంలోని పాముల బస్తీకి చెందిన నూనె శైలజ(25)గా గుర్తించారు. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోనుంచి వెళ్లినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలికి భర్త సత్యానంద్ ముగ్గురు పిల్లలున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేగాకుండా మృతురాలి చేయిని గుర్తుతెలియని దుండగులు నరికేసినట్లు తెలిపారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా జనరల్ ఆసుపత్రిలో, సఖి కేంద్రానికి గజాల దూరంలో మహిళ హత్య కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story