- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైల్లో భర్త.. ప్రియుడితో భార్య రాసలీలలు.. నగ్నంగా ఊరేగించిన గ్రామస్తులు
దిశ, వెబ్‌డెస్క్: వివాహ వ్యవస్థను వివాహేతర సంబంధాలు కూల్చివేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయి. పెళ్లినాటి ప్రమాణాలను, ప్రేమను కాలదన్ని ప్రవర్తిస్తున్నారు. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలను పెట్టుకొంటున్నారు. తాజాగా ఒక భార్య తన భర్త జైలులో ఉన్నాడని మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ఎవరికి తెలియదు కదా అని అతడిని డైరెక్ట్ గా ఇంటికే రప్పించుకొంది. ఇక వీరి వ్యవహారం గమనించిన గ్రామపెద్దలు వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కఠిన శిక్ష విధించారు. ఇంకోసారి అలాంటి తప్పు ఎవరు చేయకుండా వారిని నగ్నంగా రోడ్లపై తిప్పించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. బాద్తలి పంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి దొంగతనం నేరం క్రింద ఏడాది క్రితం జైలు పాలయ్యాడు. దీంతో అతని భార్య ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలోనే మహిళకు, ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఇంట్లో లేడని ప్రియుడిని ఇంటికే పిలిపించుకొని రాసలీలల్లో మునిగితేలేది. ఇక మంగళవారం కూడా అతడిని ఇంటికి పిలిచింది. ఈ విషయాన్ని గమనించిన గ్రామ పెద్దలు వారు బెడ్ పై నగ్నంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు. అనంతరం ఇద్దరికి దేహశుద్ది చేశారు. అంతేకాకుండా భర్త ఉండగానే ఇలాంటి సంబంధాలకు అలవాటుపడినవారికి శిక్ష అంటూ వారిద్దరిని నగ్నంగా కిలోమీటర్ మేర నగ్నంగా ఊరేగించారు. ఇంతలోనే పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన ఆ గ్రామానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.