నటశేఖరునికి టాలీవుడ్ ప్రముఖుల బర్త్‌డే విషెస్

by Shyam |
నటశేఖరునికి టాలీవుడ్ ప్రముఖుల బర్త్‌డే విషెస్
X

ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి.. ఎన్నో ప్రయోగాలకు ఆద్యుడిగా నిలిచి.. ‘సూపర్ స్టార్’గా ఎదిగిన నటుడు కృష్ణ. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు వేసిన కృష్ణ.. ‘తేనే మనసులు’ సినిమాతో హీరోగా మారారు. న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా అంచెలంచెలుగా ఎదుగుతూ.. తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆదివారం ( మే 31)న 77వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్న నటశేఖరునికి కొడుకు మ‌హేశ్ బాబుతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన తండ్రికి ట్విటర్ వేదికగా బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ‘మీకు ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఎప్పటికీ మీరే నా సూపర్‌‌స్టార్‌. హ్యాపీ బర్త్‌డే నాన్న’ అంటూ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా తన తండ్రితో చిన్నప్పుడు దిగిన ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నారు మహేశ్. ఇక మహేశ్ కూతురు సితార త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కృష్ణ ఫోటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బ‌ర్త్ డే తాత గారు.. ల‌వ్ యూ వెరీ మ‌చ్.. ఈ రోజు మీకు మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను’ అని విషెస్ తెలిపింది.

‘మీ అభిమాని నుంచి ఇదో ట్రిబ్యూట్. డబ్స్ ఫర్ లెజెండరీ సీన్.. హ్యపీ బర్త్ డే మామయ్య’ అంటూ కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెబుతూ ఓ వీడియో షేర్ చేశాడు సుధీర్ బాబు. ‘అక్కడ కాదురా.. ఇక్కడ కాల్చు.. వందేమాతరం వందేమాతరం వందేమాతరం’ అంటూ సుధీర్ బాబు సూపర్‌గా డైలాగ్ చెప్పి.. ఘట్టమనేని అభిమానులను ఖుషీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘కథానాయకుడిగా 345, దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70mm చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్‌. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూప‌ర్ స్టార్ కృష్ణ‌ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ – చిరంజీవి

‘హ్యపీ బర్త్ డే టూ డేరింగ్ డాషింగ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. గతేడాది ఇదే రోజు.. సూపర్‌స్టార్‌తో మోస్ట్ ఫన్ ఫిల్డ్ ‘సరిలేరు నీకెవ్వరు’ జర్నీ ప్రారంభమైంది. అనిల్ సుంకర, దిల్ రాజు గార్లకు కృతజ్ఞతలు. సరిలేరు టీమ్ అందరికీ థ్యాంక్స్’ – అనిల్ రావిపూడి

Advertisement

Next Story