దిగ్గజ ఐటీ సంస్థ విప్రో కీలక నిర్ణయం!

by Harish |   ( Updated:2020-11-03 09:35:52.0  )
దిగ్గజ ఐటీ సంస్థ విప్రో కీలక నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలోని తమ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హొమ్ అవకాశాన్ని వచ్చే జనవరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఇటీవల టాటా కంపెనీ తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశాన్ని పొడిగించిన తర్వాత విప్రో కూడా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 2021, జనవరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉద్యోగులకు ఇచ్చిన ఈ-మెయిల్‌లో కంపెనీ స్పష్టం చేసింది. విప్రోలో మొత్తం 1.85 లక్షల మంది ఉద్యోగులున్నారు.

వీరిలో ఎక్కువగా భారత్, అమెరికాల్లోనే ఉన్నారు. గత కొద్దిరోజులుగా అమెరికాలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభమవడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కంపెనీ పేర్కొంది. భారత్‌లో కొవిడ్-19 వ్యాప్తి తగ్గుతున్నప్పటికీ కేసులు సంఖ్య భారీగానే నమోదవుతోంది. ఈ కారణంగా పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్టు, ఇతర దేశాల్లో సైతం అక్కడి స్థానిక పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే శాశ్వతమే ఉండొచ్చని, ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసే అవసరం ఉండకపోవచ్చని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల ఆరోగ్యం తమకు తొలి ప్రాధాన్యమని విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భానుమూతి చెప్పారు.

Advertisement

Next Story