- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇక ఆఫీసులకు రండి.. ఉద్యోగులకు WIPRO అలర్ట్
దిశ, వెబ్‌డెస్క్ : కొవిడ్-19 మొదటి, సెకండ్ వేవ్ నేపథ్యంలో మల్టీనేషనల్, బడా ఐటీ కంపెనీలు చాలా వరకు తమ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలని విప్రో ఆదేశాలు చేసింది. కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడు విజృంభిస్తుందో తెలియదు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉవ్వెత్తున సాగుతున్నందున సెప్టెంబర్ నుంచి ఉద్యోగులు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని విప్రో మానవ వనరుల అధికారి సౌరభ్ గోవిల్ తెలిపారు.
కరోనా మహమ్మారి దేశాల మధ్య వివిధ రూపాల్లోకి మారుతూ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఒక పరిమాణం, అందరికీ ఒకేలా ఫిట్ అవ్వలేదని వెల్లడించారు. కాగా, విప్రోను దృష్టిలో పెట్టుకుని మిగతా బడా కంపెనీలు కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశాలు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.