- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో సమంత రిస్క్ చేస్తోందా.. ఆ కుటుంబాన్నే వెనక్కి నెట్టి..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పురాణాలు అనేవి మారవు. ఎన్నో ఏళ్ళ క్రితం కవులు రాసిన కథలను బట్టే వాటి తీరుతెన్నులు మారతాయి. అది సినిమాగా తీసినా, వెబ్ సిరీస్ గా తీసినా అందులో ఉన్న ప్రధాన అంశాన్నే ప్రేక్షకులకు చెప్తారు దర్శకులు. ఇక పురాణాలు, ఇతిహాసాలు ఎన్నిసార్లు, ఎంతమంది తీసిన ఒకేలా ఉంటాయి. నటీనటులు మాత్రం మారతారు కానీ భావం మారదు, భావోద్వేగం మారదు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే కొంతమంది తీసిన సినిమాలు హిట్ అవుతాయి, ఇంకొంతమంది తీసిన సినిమాలు ఫట్ అవుతాయి. ఒకే పురాణ కథను రెండు సార్లు తీసినా ప్రేక్షకులు ఆదరించలేదు.. అయితే అదే కథతో వస్తున్న మరో సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అంతలా కనెక్ట్ అయినా సినిమా ఏంటీ..? అంటే అక్కినేని ఇంటి కోడలు సమంతతో దర్శకుడు గుణశేఖర్ నిర్మిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం.
శకుంతల- దుష్యంతుల ప్రేమ కథ ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అదొక అద్భుత ప్రేమ కావ్యం. ఆ ప్రేమ కావ్యం ఆధారంగానే గుణశేఖర్ ‘శాకుంతలం’ తెరకెక్కిస్తున్నాడు. ఇకపోతే ఈ తరహా కథతోనే తెలుగులో రెండు సినిమాలు వచ్చాయి. కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్ లో సీనియర్ ఎన్టీఆర్, సరోజాదేవి హీరోహీరోయిన్లుగా ‘శకుంతల’ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా ఎన్టీఆర్ కి నష్టాలను మిగిల్చిందని టాక్. ఇక ఇదే ప్రేమకథను ఆ తర్వాత ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో చూపించారు. ఇందులో దుష్యంతుడిగా నందమూరి బాలకృష్ణ నటించాడు. అయినా కూడా విజయం దక్కలేదు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
ఇక దీంతో ఇప్పుడు సామ్ నటిస్తున్న ఈ ‘శాకుంతలం’ కూడా అదే తరహాలో పరాజయాన్ని చవిచూస్తుందా..? లేక బాలయ్యకు సాధ్యం కానీ విజయాన్ని సమంత నిజం చేస్తోందా..? అనేది హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో అదిరిపోయే గ్రాఫిక్ లు, డిజైన్లు లేవు.. ఇప్పుడు అలా కాదు గుణశేఖర్ ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక ఎలాగూ సమంత ఉంది.. దీంతో ఈసారి ఈ ప్రణయ గాధ హిట్ టాక్ ని సొంతం చేసుకోని ట్రెండ్ సెట్ చేస్తోందని అభిమానులు నమ్మకంగా చెప్తున్నారు. మరికొందరు ఇలాంటి కథను ఎంచుకోని సామ్ రిస్క్ చేస్తోంది, బాలయ్యకే సాధ్యం కాలేదు.. సామ్ వలన ఏం అవుతోంది అని విమర్శిస్తున్నారు. మరి నందమూరి కుటుంబానికే అచ్చిరాని ఆ సినిమా సమంతకు అచ్చి వస్తుందా..? లేదా..? వారినే వెనక్కి నెట్టి నిలబడుతుందా అని చూడాలంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.