ప్రాథమిక విద్యపై ఎటూతేల్చని ప్రభుత్వం

by Shyam |
ప్రాథమిక విద్యపై ఎటూతేల్చని ప్రభుత్వం
X

దిశ ప్రతినిధి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నుంచి 9 నుంచి ఆపై తరగుతులను ప్రారంభించింది. కానీ 1 నుంచి 8 తరగతులపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ప్రాథమిక పాఠశాలల సంగతేంటని తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొన్నది. 1నుంచి 8 తరగతులకు ఈ విద్యా సంవత్సరం జీరో ఇయర్‌గానే ముగియనుందా.. ? అన్న సందేహాలు విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 9,10 తరగతులకు అవకాశం ఇవ్వడంపై సంతోష పడినా.. అరకొర ఫీజులతో ఖర్చులు వెల్లదీయడం ఎలా..? అంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. సెలబస్ పూర్తికి క్లాసుల నిర్వహణ ఎలా ఉంటుందనే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాథమిక విద్య పరిస్థితి

కరోనా వైరస్ తగ్గముఖం పట్టడం.. వ్యాక్సిన్ రావడంతో వెరసి రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు ప్రారంభానికి పచ్చజెండా ఊపింది. కేవలం తొమ్మిది, పది తరగతులకు మాత్రమే అవకాశం ఇచ్చింది. మరి కింది తరగతుల సంగతేంటని ప్రశ్నలు తెలెత్తుతున్నాయి. ప్రాథమిక విద్యకు ఈ ఏడాది జీరో ఇయగానే ప్రకటించనున్నట్లు విద్యావర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి దీనిపై సరైనా స్పష్టత రాకపోవడంతో ఉన్నత తరగతులు ప్రారంభమైన కొన్ని రోజులకు మరికొన్ని తరగతులకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి.

కరోనాతో ప్రైవేటుకు గోస..

కరోనా ప్రభావంతో పెద్ద మొత్తంలో దెబ్బతిన్నవి ప్రైవేటు పాఠశాలలే. కరోనా దెబ్బకు అందులో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బందితో పాటు పాఠశాలల యాజమానులు లాక్ డౌన్ సమయంలో ఇతర పనులు వెతుక్కోవాల్సి వచ్చింది. చాలా మంది ఉపాధ్యాయులు బతుకుదెరువు కోసం కూరగాయలు, టీ కొట్లు, ఇతర సీజనల్ వ్యాపారాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత తరగతులను ప్రారంభించింది. కానీ కేవలం 9 నుంచి ఆపై తరగతులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. ఈ రెండు తరగతుల నుంచి వచ్చే ఫీజులతో చదువులు చెప్పే ఉపాధ్యాయుల వేతనాలకు సరిపోవని యాజమాన్యాలు వాపోతున్నాయి. భవనాల అద్దె, ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది వేతనాలు ఎలా భరించాలని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed