బతికున్న భర్తకు డెత్‌ సర్టిఫికెట్‌.. ఆస్తికోసం !

by srinivas |
బతికున్న భర్తకు డెత్‌ సర్టిఫికెట్‌.. ఆస్తికోసం !
X

దిశ, వెబ్‌డెస్క్: బతికి ఉన్న భర్త పేరిట దొంగచాటుగా డెత్‌ సర్టిఫికెట్ తీసింది. రెవెన్యూ అధికారులను బురిడీ కొట్టించి ఆస్తిని నొక్కేసింది. కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన రవికుమార్ అనే వ్యక్తికి పాణ్యం మండలం అలమూరుకు చెందిన హసినాతో వివాహం జరిగింది. 2011లో రవికుమార్‌కు యాక్సిడెంట్ కావడంతో మంచానికే పరిమితం అయ్యాడు. ఇదే సమయంలో భర్త పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం హసినా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది. తర్వాత భర్తతో గొడవ కారణం వేరే చోటా ఉంటోంది.

ఇదేక్రమంలో 2017లో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన హసీనా.. తన భర్త చనిపోయాడని డెత్ సర్టిఫికెట్ అప్లై చేసింది. వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ నుంచి సంబంధింత నివేదికను తీసుకొని ఆర్డీవో కార్యాలయానికి వెళ్లగా డెత్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దీంతో మహిళ మొత్తం ఆస్తిని దక్కించుకోవడంతో విషయం తెలిసిన భర్త షాక్‌కు గురయ్యాడు. రెవెన్యూ అధికారులతో కలిసి తన భార్య మోసం చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

Advertisement

Next Story