- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తను ఇంట్లో బంధించి.. అదృశ్యమైన భార్య.. ఎక్కడికెళ్లిందంటే..?
దిశ, చార్మినార్: డబ్బుల విషయమై తలెత్తిన వివాదంలో భర్తను ఇంట్లో బంధించి భార్య అనుమానస్పద స్థితిలో అదృశ్యమయిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. చాంద్రాయణగుట్ట ఏఎస్ఐ కె.సుధాకర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం ..చాంద్రాయణగుట్ట దస్తగిరి నగర్‌కు చెందిన మహ్మద్ ఆదిల్ తన మొదటి భార్యతో విడిపోయాక మూడేళ్ల క్రితం ముంబయికి చెందిన నజ్మీన్ అన్సారీ(34)ని వివాహం చేసుకున్నాడు. అయితే నజ్మీన్ అన్సారీ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరి మధ్య తరచు డబ్బుల విషయంలో వివాదం తలెత్తేది. దీంతో తన భర్తకు చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయేది. కాసేపటికే తిరిగి వచ్చేది.
ఈ నేపధ్యంలో ఈ నెల 22వ తేదీన రాత్రి మరో సారి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. 23వ తేదీన ఉదయం వేళలో తన భర్త మహ్మద్ ఆదిల్ ఉన్న ఇంటికి బయటి నుంచి తాళాలు వేసి వెళ్లిపోయింది. భార్య ఆచూకి కోసం చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ ప్రయోజనం కనిపించకపోవడంతో 24వ తేదీన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును నమోదు చేసుకుని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.