- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 10 వేలతో భర్తను చంపిన భార్య.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
దిశ, గద్వాల: ప్రియుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ భర్తను కడతేర్చింది. ఈ ఘటన గద్వాల జిల్లాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గద్వాల్ మండలం తుర్కొనిపల్లిలో ఈ నెల 2వ తేదీన అనుమానాస్పద స్థితిలో రాజు మృతదేహం లభ్యం అయింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య కదలికలపై అనుమానంతో విచారించగా అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ తెలిపిన వివరాల ప్రకారం.. బోయ చుక్క రాజు-మాధవి దంపతులు.. వీరికి 11 ఏండ్ల క్రితం వివాహం జరగగా.. ముగ్గురు సంతానం. గత రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గద్వాల్ మండలం తుర్కొనిపల్లికి వచ్చారు. ఈ క్రమంలోనే గ్రామశివారులోని బత్తాయితోటలో పనిచేస్తూ స్థిరపడ్డారు. ఇదే సమయంలో భార్య కదలికలపై అనుమానం పెంచుకున్న రాజు మంచి పద్ధతిలో ఉండాలంటూ పలుమార్లు హెచ్చరించారు. ఈ గొడవలతో గత 3 నెలల క్రితం భర్తపై కోపంతో సొంతూరు అయిన భగవాన్‌పల్లికి వెళ్లింది మాధవి. ఇదే సమయంలో అదే గ్రామంలో ఉన్న మాజీ ప్రియుడు మునేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఇది తెలియని భర్త రెండు నెలల క్రితం భార్య వద్దకు వెళ్లి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నాడు. రాజుతో కాపురం ఇష్టం లేని మాధవి హత్య చేసేందుకు ప్రియుడితో పథకం వేసింది. ఈ నేపథ్యంలోనే మునేశ్ తన స్నేహితులైన జైపాల్, బోయ రవి, రవీంద్ర, అంజిలకు ఉన్న విషయం చెప్పి రూ. 10 వేలు సుపారీతో హత్యకు ప్లాన్ చేశారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం(అక్బోబర్ 1న) సాయంత్రం మాధవి ప్రియుడికి కాల్ చేసింది. ఈ రోజే రాత్రి చంపేద్దామని చెప్పింది. దీంతో మునేశ్ తన స్నేహితులను రప్పించుకున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి రాజు తినే అన్నంలో భార్య నిద్రమాత్రల పొడి కలిపింది. మత్తులోకి జారుకోగానే ప్రియుడిని, స్నేహితులను పిలిపించి, మెడకు ఉరి వేసి హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడంటూ నమ్మించేలా ట్రాన్స్‌ఫార్మర్ దిమ్మెపై పడుకోబెట్టారు. శనివారం ఉదయం భర్త కనిపించడం లేదంటూ మాధవి దొంగ ఏడుపులు ఏడ్చింది. దీంతో ఆమె కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించి అసలు నిజం రాబట్టారని.. నిందితులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ మీడియాకు వివరణ ఇచ్చారు.