- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భార్యకు నాలుగో నెల.. నాకు సంబంధం లేదన్న భర్త
దిశ, వెబ్‌డెస్క్: భార్యకు నాలుగో నెల.. ఈ విషయం విన్న భర్త ఎగిరి గంతెస్తాడు. కానీ, ఇక్కడ మాత్రం విడాకులు ఇచ్చాడు. భార్య గర్భవతి కావడానికి తనకు సంబంధం లేదని తెగదింపులు చేసుకున్నాడు. దీంతో ఆమె దిక్కుతోచని స్థితిలో 10 నెలల పాటు సావాసం చేసింది. ఎన్నో అవమానాల మధ్య ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. సినీఫిక్కీలో జరిగిన ఈ వ్యవహారం మాజీ ప్రియుడి ఎంట్రీతో సుఖాంతం అయింది.
పూర్తి వివరాళ్లోకి వెళితే..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన ఓ యువతి.. కూసుమంచి మండలం నర్సింహులుగూడెంకు చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. సినిమాలు, షికార్లు అంటూ ప్రేమ పక్షుల్లా విహరించారు. ఏకాంతంగా కూడా గడిపారు. ఇద్దరొక్కటయ్యారు. వారికి తెలియకుండానే మరో బిడ్డకు కారణమయ్యారు. కానీ, ప్రేమ విషయం ఇంట్లో తెలిసేసరికి కంగారు పడ్డారు. పెండ్లి చేయండి అంటూ రిక్వెస్ట్ చేసినా ఇరు కుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించే ధైర్యం లేక ఎవరి దారి వారు చూసుకున్నారు. కూతురు ప్రేమ వ్యవహారం తెలిసిన పెద్దలు వెంటనే ఆమెకు పెండ్లి చేయాలని నిర్ణయించారు. ఇది తెలుసుకున్న ప్రియుడు-ప్రియురాలు కూడా నోరు మెదపకుండా ఉన్నారు. సదరు యువతికి మరో అబ్బాయితో ఘనంగా పెండ్లి చేశారు.
అంతా బాగానే ఉందని అనుకున్నారో లేదో.. నాలుగు నెలల కడుపు వ్యవహారం వారికి గుండెపోటును తెప్పించింది. పెండ్లి చేసిన రెండు నెలలకే కూతురికి నాలుగు నెలల కడుపు అన్న విషయం తల్లిదండ్రులను తీవ్ర అవమానానికి దారి తీయగా.. భార్య తీరుతో భర్త తల పట్టుకున్నాడు. ఇక ఆమెను వదిలించుకోవడమే ఉత్తమం అనుకున్నాడు. ఇరుగుపొరుగు వారి మాటలు మరింతగా బాధించడంతో పంచాయితీ పెట్టాడు. నాలుగు నెలల కడుపుతో ఉన్న భార్య వద్దని వదిలేశాడు.
దీంతో గర్భవతిగా ఉన్న కూతురిని తల్లిదండ్రులు ఇంటికి తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఇరుగుపొరుగు వారి సూటి పోటి మాటల మధ్య కాలం వెళ్లదీశారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు మాజీ ప్రియుడు గుర్తొచ్చాడు. అతనికే ఇచ్చి పెండ్లి చేస్తే కూతురు కూడా సంతోషంగా ఉంటుందనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం షీటీమ్స్ ఇన్‌చార్జీ సీఐ అంజలిని కలిశారు. తమ పరిస్థితిని మొత్తం వివరించారు. వారిని బాధను అర్థం చేసుకున్న సీఐ అంజలి చొరవ చూపించారు.
మాజీ ప్రియుడి ఇంటి అడ్రస్‌ను కనుక్కొని అతనికి పలుమార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. ఇరు కుటుంబీకులతో చర్చించారు. ఒక అమ్మాయి జీవితం నాశనం కావొద్దని.. ప్రియుడిగా అతని బాధ్యత గుర్తు చేశారు. ఈ తతాంగం మొత్తం జరిగే సరికి 10 నెలలు గడిచేపోయాయి. ఇదే సమయంలో ఆ యువతి ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో పొలీసులు చూపిన చొరవతో మాజీ ప్రియుడు.. బిడ్డతో వచ్చిన ప్రియురాలిని అంగీకరించాడు. దీంతో వెంటనే పోలీసులు ఇరు కుటుంబీకుల సమక్షంలో పెండ్లి జరిపించారు. దీంతో నాలుగు నెలల కడుపుతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ యువతి జీవితం.. మాజీ ప్రియుడి రాకతో సుఖాంతం అయింది.