- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కుటుంబ కలహాలు.. పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య
దిశ, జడ్చర్ల : కుటుంబ కలహాలతో భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం జడ్చర్ల మండలంలో వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలం ఏక్వయాపల్లి గ్రామానికి చెందిన మేడిపల్లి విష్ణువర్ధన్ రెడ్డి(51), కళావతి (46) భార్య భర్తలిద్దరూ శుక్రవారం రాత్రి గొడవ పడ్డారు. కళావతిని భర్త కొట్టాడని మనస్థాపం చెంది ఒకరి తర్వాత ఒకరు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
దీంతో స్థానికులు వారిని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో కళావతి మృతి చెందగా.. చికిత్స పొందుతూ విష్ణువర్ధన్ రెడ్డి మృతి చెందాడు. మృతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు అయ్యాయని, మృతుల కుటుంబం కూడా ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ తరచుగా భార్యాభర్తలు గొడవపడేవారిని స్థానికులు తెలిపారు. కూతుళ్ల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వం ఆసుపత్రిలోనే ఉంచారు.