ఇంట్లో నగ్నంగా రెచ్చిపోయిన భార్య, ఆమె ప్రియుడు.. సీసీ కెమెరాలలో రికార్డైన దృశ్యాలు చూసి భర్త షాక్

by Sumithra |   ( Updated:2021-12-01 01:50:32.0  )
caugh-on-cc-camera1
X

దిశ, వెబ్ డెస్క్: అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటైన భార్యాభర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ, ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలి. కానీ, ఈరోజుల్లో కొంతమంది భార్యాభర్తలు పరాయి వ్యక్తి మోజులో పడి తమ పచ్చటి సంసారాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. అంతేకాదు.. వారి పాడుబుద్ధి వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. యూపీలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పరాయి వ్యక్తి మోజులో పడి పిల్లల ముందే వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. భర్తకు అనుమానమొచ్చి సీసీ కెమెరాల ద్వారా పట్టుకుంటే భర్తనే చంపేస్తానంటూ బెదిరించింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశాడు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని కవినగర్ కు చెందిన వ్యక్తికి వివాహమైంది. అయితే, భార్య ఓ కేసులో నిందితురాలు. అయినా సరే అని ఆమెను అతను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇలా కొన్నాళ్లవరకు వీరి సంసారం చాలా హ్యాపీగా పిల్లలతో ముందుకు సాగుతోంది. ఇలా పచ్చగున్న సంసారంలో ఓ వ్యక్తి చిచ్చుపెట్టాడు. తన భార్యకు ఓ క్యాబ్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వీరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడడం వరకు వచ్చింది. తన భర్త రోజూ ఉదయాన్నే పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఆమె ప్రియుడు క్యాబ్ డ్రైవర్ ఇంటికి వచ్చేవాడు. ఇలా వీరిద్దరూ ఇంట్లో తెగ ఎంజాయ్ చేసేవారు. పిల్లల ముందు కూడా భార్య, ఆమె ప్రియుడు అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇది చూసి పిల్లలు కూడా విసిగిపోయేవారు. ఇలా జరుగుతున్న క్రమంలో పక్కింటివారికి అనుమానమొచ్చి విషయం భర్తకు చెప్పారు. దీంతో అతను తన భార్యపై కన్నేసి ఉంచాడు. అతనికి కూడా అనుమానమొచ్చింది. వెంటనే భార్యకు తెలియకుండా ఇంట్లోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. తన భార్య, ఆమె ప్రియుడు ఇంట్లో నగ్నంగా విచ్చల విడిగా రెచ్చిపోతున్న దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన భర్త షాకయ్యాడు. ఆ తర్వాత ఆమెను నిలదీశాడు. తనకు ఇష్టమున్నట్టు చేస్తాను… తన ఇష్టానికి అడ్డు చెబితే చంపేస్తానని బెదిరించింది భార్య. దీంతో పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.

Read more : ఈ రాత్రికి కోరిక తీరుస్తేనే నీ కూతురికి వైద్యం చేస్తానని అల్టిమేటం.. దీంతో ఆ తల్లి.

Advertisement

Next Story