- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్త గుట్టు భార్య రట్టు
దిశ, వెబ్‌డెస్క్: తనతో సంసారం చేయాల్సిన భర్త మరో మగాడితో రాసలీలలు సాగిస్తుండగా ఓ భార్య రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. పెళ్లయి నాలుగేళ్లయినా భర్త తనను దగ్గరికి తీసుకోకపోయినా భరించిన ఆమె.. అతడు స్వలింగ సంపర్కుడని తెలుసుకుని భరించలేకపోయింది. అతడి బాగోతాన్ని అందరి ముందూ బయటపెట్టి పోలీసులకు పట్టించింది. వివరాలు ఇలా.. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన ఓ యువకుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగేళ్ల క్రితం ఓ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతితో వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి అతడు భార్యతో సక్రమంగా ఉండేవాడు కాదు.
మరోవైపు నాలుగేళ్లయినా పిల్లలు ఇంకా లేరా? అంటూ బంధువుల సూటిపోటి మాటలు అంటున్నా భర్త పరిస్థితి గురించి ఎవరికీ చెప్పుకోలేకపోయింది. నాలుగు రోజుల క్రితం ఆఫీసు నుంచి వచ్చిన ఆమెకు ఇల్లు తాళం వేసి కనిపించింది. తన దగ్గరున్న మరో కీతో తాళం తీసి లోపలికి వెళ్లగా బెడ్రూమ్‌లో తన భర్త మరో యువకుడితో రొమాన్స్ చేస్తూ కనిపించాడు. దీంతో షాక్ గురైన ఆమె, తన భర్త గే అని తెలుసుకుని భర్తను నిలదీసింది. దీంతో అసహనానికి గురైన భర్త ఆమెపై చేయి చేసుకున్నాడు.
ఆమె వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. భర్త స్వలింగ సంపర్క సంబంధం పెట్టుకోవడమే కాకుండా నిలదీసినందుకు తనపై హత్యాయత్నం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read also..