భర్త ఆదేశాలతో భార్య బెట్టింగ్‌

by Sumithra |
భర్త ఆదేశాలతో భార్య బెట్టింగ్‌
X

దిశ, వెబ్‎డెస్క్ : భర్త ఆదేశాలతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఓ మహిళ. గుట్టుచప్పు కాకుండా దందా నిర్వహిస్తున్న దంపతులను హైదరాబాద్ టాస్క్‎ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు బెట్టింగ్‌లో మగవారే పట్టుబడగా.. తాజాగా ఓ మహిళ చిక్కడం ఇదే తొలిసారి.

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన ధరమ్‌సింగ్‌.. నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తే పోలీసులకు అనుమానం వస్తుందని నెలన్నర కిందట గోవా వెళ్లాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక తన భార్య సుమన్‎లతకు సోదరుడి వరుస అయ్యే రాహుల్ సింగ్‎కు నెలకు రూ.20 వేలు జీతం ఇస్తానని.. ఫోన్ ద్వారా బెట్టింగ్ కాసేవారి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించాడు. పదిహేను నంబర్లను రాహుల్‌ ఇవ్వగానే అతడు వారి పేర్లు రాసుకునేవాడు. ఇటు, హైదరాబాద్‎లో బెట్టింగ్‌ కాసిన వారి నుంచి ధరమ్‌సింగ్‌ భార్య సుమన్‌లత డబ్బులు వసూలు చేస్తోంది. వారి చిరునామాలు తెలుసుకుని ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లి డబ్బు తీసుకువస్తోంది. విశ్వసనీయ సమాచారంతో వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ధరమ్‌ సింగ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించగా బెట్టింగుల వ్యవహారం వెలుగుచూసింది. బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతులను అరెస్ట్ చేశారు. నిందితులను ఒక టీవీ, 15 సెల్ ఫోన్లు, రూ.27వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed