తల్లిదండ్రులు మృతి చిన్నారి ఏకాకి

దిశ, వెబ్‌డెస్క్: ఎదురుగా వచ్చిన రెండు బైక్‌లు ఢీ కొన్న ఘటనలో భార్యభర్తలు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందడం బాధాకరం. ఈ విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో వెలుగుచూసింది.

వివరాళ్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లెకు చెందిన శ్రీనివాస్ (40), తాడెం సమత(35) భార్యభర్తలు. అయితే, వరంగల్‌లో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సొంతూరు నుంచి వరంగల్‌కు సోమవారం బయల్దేరారు.

అయితే, మార్గమధ్యలో ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమత ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది. కూతురు అశ్విత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని చిన్నారి పరిస్థితిపై బంధువలను సమాచారం ఇచ్చారు.

Advertisement