- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పేరుతో రూ. కోటి కొట్టేశారు.. నకిలీ చెక్కులిచ్చారు
దిశ, నిర్మల్ కల్చరల్: చిట్టీల పేరిట కోటి రూపాయల డబ్బులు కాజేసిన భార్యాభర్తల వ్యవహారం నిర్మల్‌లో వెలుగులోకి వచ్చింది. సోమవారం డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సాయినేని భాగ్యలత (44), భర్త వెంగళ్‌రావుతో కలిసి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తుండేది. భర్త వెంగళరావు స్థానికంగా బ్యాంకులో ఉద్యోగం చేస్తుండేవాడు. డబ్బులు సంపాదించాలని కోరికతో ఇతరులను బురిడీ కొట్టించే ప్లాన్ వేశారు.
ఈ క్రమంలోనే చిట్ ఫండ్ కంపెనీ పెడుతున్నామని మంచిగా మాట్లాడుతూ.. గత సంవత్సర కాలం నుండి నర్వాడే వెంకట్ రావు, అతని భార్య కరుణ వద్ద నుండి రూ. 34 లక్షల 90 వేలు, ధర్మగారి హేమలత వద్ద నుండి రూ. 48 లక్షల 50 వేలు వసూలు చేశారు. ఇలా చాలా మందిని చిట్ ఫండ్ సభ్యులుగా చేర్చుకొని వారి వద్ద నుండి ఇప్పటివరకు రూ. 89 లక్షల డబ్బు వసూలు చేశారని తెలిపారు. డబ్బులు తిరిగి చెల్లించమంటే నకిలీ చెక్కులు ఇచ్చారని చెప్పారు. మోసమోయామని గ్రహించిన బాధితులు ఆదివారం అర్ధరాత్రి భార్యాభర్తలైన భాగ్యలత, వెంగళ్ రావులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు 406, 420 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.