- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ మొక్క ఖరీదు రూ. 4 లక్షలు
దిశ, వెబ్‌డెస్క్: మొక్కలందు అరుదైన మొక్కలు వేరయా అని వేరే చెప్పనక్కర్లేదు. అరుదుగా అని మాట వాడినప్పుడు దాని విలువ తెలిసిపోతోంది. అందుకే ‘జనతా గ్యారేజ్’ మూవీలో.. అరుదైన మనిషిని.. అరుదైన మొక్కతో పోలుస్తూ, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని హీరో ఎన్టీఆర్ చెబుతాడు. అలాంటి ఓ అరుదైన మొక్కను కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
‘ఫిలోడెండ్రాన్ మినిమా’జాతికి చెందిన మొక్కలు రేర్ ప్లాంట్స్. ఈ జాతికి చెందిన ఓ మొక్కకు నాలుగే ఆకులున్నాయి. అవి కాస్త పసుపు వర్ణం, మరికొంత ఆకుపచ్చ రంగుల్లో చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ మొక్కను ఇటీవల ట్రేడ్ మి అనే ఈ కామర్స్ వెబ్‌సైట్ వేలానికి ఉంచింది. వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఆ భిన్న వర్ణాల ఆకుల గల మొక్కపై మనసు పారేసుకున్నాడు. వేలంలో ఎలాగైనా ఆ మొక్కను దక్కించుకోవాలనుకున్నాడు. అందుకోసం..ఏకంగా నాలుగు లక్షల రూపాయలు చెల్లించి ఆ మొక్కను బిడ్‌లో సొంతం చేసుకున్నాడు. ఈ మొక్క ‘ఉష్ణమండల స్వర్గం’ అని దాన్ని కొన్న వ్యక్తి అభివర్ణించాడు. అలాగే ఈ మొక్క ఆకులు ఇలా భిన్నవర్ణాల్లో రావడం చాలా అరుదుగా సహజంగా సంభవిస్తాయి. కనుక వీటిని ఎక్కువగా ఉద్యాన శాస్త్రవేత్తలు, ట్రీ కలెక్టర్స్ కోరుకుంటారని ఆయన తెలిపారు.
‘మా గ్రూపు (ముగ్గురు) త్వరలో న్యూజిలాండ్‌లో ఓ ట్రోపికల్ ప్యారడైస్ నిర్మిస్తున్నాం. ఆ ట్రోపికల్ గార్డెన్‌లోనే ఓ అందమైన రెస్టారెంట్ కూడా ఉంటుంది. అందులోనే ఈ మొక్కను పెంచబోతున్నాం. ఈ ట్రోపికల్ గార్డెన్‌లో పక్షులతో పాటు, రంగురంగుల సీతాకోకచిలుకలకు నిలయంగా ఉంటుంది. ట్రోపికల్ ప్లాంట్స్‌లోని బెస్ట్ రేర్ కలెక్షన్స్‌ను మేం అందులో పెంచబోతున్నాం’ అని మొక్కను కొనుగోలు చేసిన వ్యక్తి తెలిపాడు.