అమెరికాను మరోసారి తప్పుబట్టిన WHO

by Anukaran |
అమెరికాను మరోసారి తప్పుబట్టిన WHO
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా కాలం నుంచి అమెరికా, డబ్ల్యూహెచ్ వో మధ్య దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికాపై డబ్ల్యూహెచ్ వో మరోసారి ఫైరయ్యింది. కరోనా లక్షణాలు లేనివారికి కరోనా పరీక్షలు అవసరంలేదని ఇటీవల అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలపై డబ్ల్యూహెచ్ వో స్పందించింది. సీడీసీ జారీ చేసిన మార్గదర్శకాలు తప్పు అని పేర్కొన్నది. లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనాను కట్టడి చేయాలంటే కరోనా పరీక్షలు చేయడం ఒక్కటే మార్గమని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed