చైనా వ్యాక్సిన్ ‘సినోవాక్‌’కు WHO పర్మిషన్..

by Shamantha N |   ( Updated:2021-06-01 20:18:37.0  )
చైనా వ్యాక్సిన్ ‘సినోవాక్‌’కు WHO పర్మిషన్..
X

జెనీవా : చైనా అభివృద్ధి చేసిన మరో కరోనా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటికే కనీసం 20కిపైగా దేశాల్లో పంపిణీ చేస్తు్న్న ఈ టీకా(రెండు డోసుల)ను తాజాగా ఎమర్జెన్సీ యూజ్ లిస్ట్‌లో చేర్చింది. ఇప్పటికే ఈ దేశానికి చెందిన సినోఫామ్‌కు గతనెలలో అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ అనుమతితో సినోవాక్ టీకాపై దేశాలు, ఫండర్లు, కొనుగోలు చేసే ఏజెన్సీలకు అంతర్జాతీయ స్థాయి భరోసానిచ్చినట్టయింది. రెగ్యులేటర్‌లు బలహీనంగా ఉన్న దేశాలు డబ్ల్యూహెచ్‌వో ఎమర్జె్న్సీ యూజింగ్ లిస్టులోని టీకాలను నేరుగా ఎంచుకుంటాయి. కొవాక్స్ లాంటి ఫెసిలిటీలతో ఒప్పందం కుదుర్చుకుని ఇతరదేశాలకు సరఫరా చేయడానికి మార్గం సుగమం అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed