- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డేంజర్ బెల్స్… ఒమిక్రాన్‌పై WHO తీవ్ర హెచ్చరికలు
దిశ, డైనమిక్ బ్యూరో: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతుందని అంచనా వేసింది. అయితే, ఊహించని విధంగా మరణాలు సంభవిస్తాయని WHO హెచ్చరించింది. ఒమిక్రాన్ పై మరింత రీసెర్చ్ అవసరమన్న డబ్య్లూహెచ్‌వో.. అందుకోసం నమోదవుతున్న కేసుల వివరాలను అన్ని దేశాలు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని తెలిపింది.
ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న బ్రిటన్‌లోనే 75 వేల మంది మరణించే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోకుంటే బ్రిటన్‌లో భారీ ముప్పు తప్పదని హెచ్చరించింది. అయితే, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి 25 వేల నుంచి 75 వేల ఒమిక్రాన్ మృతులు నమోదవుతాయని అధ్యయనంలో వెల్లడైందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనం ద్వారా వచ్చే ముంపును అడ్డుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపింది.
- Tags
- COVID-19