- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పక్కా ప్లాన్.. ‘ఈటల’పై పోటీ చేసేది ఎవరంటే.?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలో నిలిపేందుకు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈటల రాజీనామా తరువాత ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గులాబీ బాస్.. సామాజిక వర్గాల వారీగా గణాంకాలను పరిశీలిస్తూ అభ్యర్థిని ఖరారు చేయాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కన్నా ఈటల రాజేందర్ ఓటమే ప్రధానమన్న లక్ష్యంతో టీఆర్ఎస్ భారీ స్కెచ్ వేసే పనిలో నిమగ్నమైంది. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ గత చరిత్ర చూసుకుంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎక్కువ సార్లు గెలిచిన విషయాన్ని పరిశీలిస్తున్న టీఆర్ఎస్ నాయకత్వం.. అభ్యర్థి ఎంపికపై వ్యూహాత్మకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
సర్వేలు.. రిపోర్టులతో అలర్ట్..
టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా చేయించిన సీక్రెట్ సర్వేతో పాటు నిఘా వర్గాల ద్వారా వచ్చిన నివేదికలను ఆధారంగా చేసుకుని బరిలో ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నిలబెట్టాలి అన్న విషయంపై చర్చలు చేస్తున్నట్టు సమాచారం. ఈటల ప్రభావాన్ని తట్టకునే నాయకుడు టీఆర్ఎస్‌లో లేకపోవడంతో బలమైన వ్యక్తి కోసం ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. హుజురాబాద్‌లో రాజేందర్‌కు అనుకూలమైన వాతావరణం ఉన్న విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేసీఆర్.. ఓ వైపు ఆయనను వీక్ చేసే ప్రయత్నాల్లో కేడర్‌ను పురమాయించి మరో వైపున ధీటైన క్యాండిడేట్ కోసం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.
సాగర్ ఎన్నికలే రిపీట్ కావాలి..
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలే రిపీట్ కావాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. అక్కడి ప్రజలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి అనుకూలంగా ఉన్నప్పటికీ చివరి క్షణంలో ఓటర్లను మచ్చిక చేసుకుని టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. కురువృద్దుడైన జానారెడ్డిపై రాజకీయాలే తెలియని నోముల నర్సింహయ్య కొడుకు భరత్‌ను బరిలో నిలిపి సక్సెస్ అయినట్టే హుజురాబాద్‌లో కూడా అనామకుని చేతిలో ఈటలకు ఓటమి రుచి చూపించాలన్న తాపత్రయంతో టీఆర్ఎస్ ముందుకు సాగుతోంది.
అయితే రాజేందర్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉన్నందున చివరి క్షణం వరకూ అభ్యర్థి పేరు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థి ఎవరైనా సరే గెలుపు మాత్రం మనదే ఉండాలి.. ఈటల ఓటమి కోసం అన్ని శక్తులా ప్రయత్నించాలని ఇటీవల హుజురాబాద్ ఇంఛార్జీలు, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయినప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. దీంతో మంత్రులు, ప్రముఖులంతా కూడా హుజురాబాద్ కేంద్రంగా తిరుగుతున్నారు. సాగర్ ఎన్నికల మాదిరిగానే ఈ ఉప ఎన్నికను కూడా సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించనున్నట్టు తెలుస్తోంది.
ఇంఛార్జీలతో నేరుగా మాట్లాడటం, అక్కడి పరిస్థితులను సమీక్షించి అప్పటికప్పుడు ఆయా చోట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. దీంతో హుజురాబాద్‌లోని ఐదు మండలాల్లో ఇంఛార్జీలు కూడా ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.