భారత్‌పై who చీఫ్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే

by Shamantha N |
భారత్‌పై who చీఫ్ ప్రశంసల వర్షం.. ఎందుకంటే
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కొనే టీకాలను ఆపత్కాలంలో ఇతర దేశాలకూ పంపిణీ చేస్తూ భారత్ ఆదర్శంగా నిలుస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయసస్ ప్రశంసలు కురిపించారు. 60కి పైగా దేశాలకు భారత్ టీకాలను పంపిణీ చేసిందని, ఇతర దేశాలకూ ఇదే విధంగా టీకా పంపిణీలో సమానతను పాటించాలని కోరుకున్నారు. కొవాక్స్‌కు, 60కిపైగా దేశాల్లో టీకా పంపిణీకి భారత్ కట్టుబడి ఉన్నదని ఆయన ట్వీట్ చేశారు.

భారత్ సరఫరా చేసిన టీకాలతో దాదాపు 60 దేశాల్లో వాటి హెల్త్ వర్కర్లు, ఇతర ప్రాధాన్య వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభించగలిగాయని వివరించారు. కొవాక్స్ ఒప్పందం కింద భారత్ కనీసం ఆరు లక్షల కరోనా టీకాలను ఆఫ్రికాలోని ఘనా దేశానికి బుధవారం డిస్పాచ్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు భారత్ సుమారు 229 లక్షల డోసులను పంపించిందని కేంద్ర విదేశాంగ శాఖ ఈ నెల 12న పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed