మహిళా రిజర్వేషన్ బిల్లు ఏది?:సీతారాం ఏచూరి

by Shamantha N |
మహిళా రిజర్వేషన్ బిల్లు ఏది?:సీతారాం ఏచూరి
X

బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు గడిచినా మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు తీసుకురాలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. దశాబ్ద కాలంగా మహిళా రిజర్వేషన్ బిల్లు స్పీకర్ రూంలోనే ఉండిపోయిందనీ, బీజేపీ అధికారంలోకొచ్చి ఆరేళ్లు గడిచినా, ఎందుకు పాస్ కాలేదని ఆయన అడిగారు. మహిళా దినోత్సవం ఏ ఒక్కరోజుకో పరిమితం కాదనీ, సమాన వేతనాలు, హక్కుల కోసం నిరంతరం జరిగే ప్రక్రియ అని తెలిపారు. సమాన హక్కులు సాధించే వరకు మహిళలు ఉద్యమాలు చేస్తూనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును తేకుండా, ప్రధాని మోదీ సోషల్ మీడియాను మహిళల చేతికి అప్పగించడం కేవలం జిమ్మిక్కని Enl విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్‌ నిర్వహణ శక్తిమంతమైన మహిళల చేతికి అప్పగిస్తున్న ప్రధాని మోదీ మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ విధంగా విమర్శలు చేశారు.

tags: sitaram yechury, cpi(m) national leaders, women’s day

Advertisement

Next Story

Most Viewed