‘వకీల్ సాబ్’ విడుదల ఈ ఏడాది లేనట్టేనా.?

by Shyam |
‘వకీల్ సాబ్’ విడుదల ఈ ఏడాది లేనట్టేనా.?
X

జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ అభిమానుల ఆరాధ్యుడు. తెలుగు తెర మీద ఆయన కనిపించక దాదాపు రెండేళ్లవుతున్నది. ఆయన చివరగా త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటించిన ‘అజ్ఞాతవాసి’ మూవీ 2018 జనవరి 10న విడుదలైంది. అయితే, 2019 ఎన్నికల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లో నటించేందుకు అంగీకరించి పలు చిత్రాలు చేస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత వెండితెర మీదకు వస్తున్న పవన్ స్పీడ్ స్పీడ్‌గా నాలుగైదు సినిమాలు చేసి, మళ్లీ రాజకీయాలతో బిజీ అవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కాని నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) రూపంలో ఆయన స్పీడ్‌కు బ్రేక్ పడింది. దీంతో ఈ ఏడాది తప్పక తమ అభిమాన హీరోను వెండి తెరపై చూడొచ్చని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలేలా ఉంది.

డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న బాలీవుడ్ మూవీ ‘పింక్’ రిమేక్ ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చినట్టు సమాచారం. ఈ చిత్రం పూర్తి చేసి క్రిష్‌తో చేసే సినిమాకి టైమ్ కేటాయించాలని పవన్ ప్లాన్ చేసుకున్నారు. కాని ఇప్పుడు ఇంటిలో నుంచి కాలు బయటికి పెట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి మళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో.. ఒకవేళ షూటింగ్స్‌కి అనుమతి లభించినా.. థియేటర్స్ ఓపెన్ అవ్వడానికి మాత్రం చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘వకీల్‌సాబ్’ విడుదల ఎప్పుడుంటుంది? అనే అనుమానాలు పవన్ అశేష అభిమానుల్లో నెలకొన్నాయి.

తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఈ యేడాది విడుదల అవ్వడం కష్టమే అంటున్నారు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి లేదంటే రిపబ్లిక్‌డేకు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు ఉన్నారట. మొదట ఈ ఏడాది వేసవిలో లేక సెప్టెంబర్ నెలలో విడుదల చేద్దామని దిల్ రాజు భావించారని, కాని ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నారని టాక్. అయితే, ఇప్పుడున్న కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ నాటికి థియేటర్స్ ఓపెన్ అయ్యే విషయమై క్లారిటీ లేదు. అందుకే వచ్చే సంవత్సరం జనవరిలో ఈ చిత్రం విడుదల ఉంటుందనేలా నిర్మాత దిల్ రాజు హింట్స్ ఇస్తున్నారట. దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది.

Tags: pawan kalyan, janasena party, vakeel saab movie, politician, release, covid 19 effect

Advertisement

Next Story

Most Viewed