పెళ్లైన హీరోతో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదన్న నటి

by Shyam |   ( Updated:2021-08-08 04:42:25.0  )
పెళ్లైన హీరోతో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదన్న నటి
X

దిశ, సినిమా : బాలీవుడ్ హిట్ పెయిర్‌గా పేరుతెచ్చుకున్న యాక్ట్రెస్ హేమమాలిని, నటుడు ధర్మేంద్ర చాలా ఏళ్ల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ధర్మేంద్రకు అంతకుముందే పెళ్లి కాగా, హేమమాలిని తనను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిందట. కాగా ఒక టెలివిజన్ షోకు గెస్ట్‌గా హాజరైన హేమ.. ధర్మేంద్రతో పెళ్లి విషయంలో ఎదుర్కొన్న సమస్యలు పంచుకున్నారు. మొదట్లో ధర్మేంద్రను పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదని, కానీ లైఫ్ పార్ట్‌నర్‌గా అతడి లాంటి వ్యక్తే రావాలని అనుకునేదాన్నని చెప్పింది.

అయితే చాలాకాలం పాటు సినిమాల్లో కలిసి పనిచేశాక ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని, చివరకు అది పెళ్లికి దారితీసిందని తెలిపింది. అయితే ధర్మేంద్రకు ముందే వివాహం కావడం వల్ల ఈ పెళ్లికి తన పేరెంట్స్ ఒప్పుకోలేదని వెల్లడించింది. కానీ తాము అప్పటికే చాలా దగ్గరయ్యామని, అలాంటి పరిస్థితుల్లో మరొకరిని ఊహించుకోవడం కష్టమని భావించానంది. ఇదే విషయాన్ని ధర్మేంద్రకు చెప్పడంతో పెళ్లి జరిగిపోయిందని చెప్పింది.

Advertisement

Next Story