ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు

by Harish |
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే దేశీయ మార్కెట్లు సానుకూలంగానే ఉన్నాయని, ఈ తురణంలో కొనుగోళ్ల కంటే, లాభాల స్వీకరణ ఉత్తమమని మార్కెట్ నిపుణులు, శామ్‌కో సెక్యూరిటీస్ సీఈవో జమీత్ మోదీ అభిప్రాయపడ్డారు. గత వారం మార్కెట్ సూచీలు భారీగానే ట్రేడయ్యాయి. ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల త్రైమాసిక ఫలితాలు సానుకూలంగానే ఉన్నాయి. అయితే, ప్రధాన కంపెనీల ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నాయి. కాబట్టి వాటి ఫలితాలను బట్టి మార్కెట్ పరిస్థితి మారుతుందని జమీత్ తెలిపారు.

ఇదివరకు తొలి త్రైమాసికానికి సంబంధించి ఐటీ, ఫైనాన్స్ సర్వీసులు, బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ కంపెనీల ఫలితాల ప్రదర్శన బాగుంది. ముఖ్యంగా కరోనా సంక్షోభాన్ని అర్థం చేసుకుని నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకున్నాయి. లాక్‌డౌన్ కొనసాగడంతో ప్రజలు ఇంటికే పరిమితమవడంతో డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నారు. ముఖ్యంగా కొవిడ్-19 నేపథ్యంలో బీమా పాలసీలు పెరిగాయి. ఫైనాన్స్ సేవల కంపెనీలు ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్లపై మొగ్గు చూపారు. కానీ, ఈ పరిస్థితులు ఎక్కువకాలం కొనసాగేలా కనిపించడంలేదని జమీత్ తెలిపారు.

కొవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత మార్కెట్ ప్రస్తుత లాభాలు కోల్పోయే అవకాశముందని, సాధారణంగా మార్కెట్లు స్వల్పకాలిక సంఘటనలపై ఎక్కువగా స్పందిస్తాయని జమీత్ పేర్కొన్నారు. సంక్షోభం లాంటి పరిస్థితుల్లో ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు స్వల్పకాలిక, మిడ్‌టర్మ్‌లకు రాణిస్తాయనుకోవడం అవివేకమని అభిప్రాయపడ్డారు. ఇక, ఈ వారంలో కార్పొరేట్ ఫలితాలు మార్కెట్‌కు కీలకంగా ఉండనున్నట్టు జమీత్ మోదీ భావించారు.

అలీబాబా జాక్‌మాకు భారత్ కోర్టు సమన్లు

Advertisement

Next Story