- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారిని ఆదుకోవడం అభినందనీయం: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
దిశ, కూకట్పల్లి: ఆపన్న హస్తం కోసం వేచి చూస్తున్న వారిని ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఐదుగురు దివ్యాంగులకు వీల్ చైర్లు, పది మంది నిరుద్యోగులకు తోపుడు బండ్లు, 2 వందల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 30 మంది మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఖార్డ్ సంస్థ నిర్వాహకులు సుమన్ మల్లాది, మంజులత మల్లాది లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అభినందించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు జీవనోపాధి తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, వారిని ఆదుకోవడం అభినందనీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖార్డ్ సంస్థ నిర్వాహకులు సుమన్ మల్లాది, మంజులత మల్లాది, ఆశ్రయ ఆకృతి డైరెక్టర్ డిపికే బాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు శాఖయ్య తదితరులు పాల్గొన్నారు.