- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఎగిరి గంతేస్తున్న యూజర్స్
దిశ, ఫీచర్స్: ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్.. ఎన్నో రోజుల నుంచి తమ వినియోగదారులను ఊరిస్తున్న ‘మల్టీ-డివైజ్ సపోర్ట్’ ఫీచర్ మరికొన్ని రోజుల్లో రాబోతుంది. అధికారిక విడుదలకు ముందు ప్రస్తుతం ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. యూజర్స్ వాట్సాప్‌లో లింక్ డివైజ్ లేదా వెబ్ వాట్సాప్‌లోకి వెళితే మల్టీ డివైజ్ బీటా పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేశాక ‘మీ ఫోన్ ఆన్‌లైన్‌లో లేకుండానే నాలుగు డివైజ్‌లకు వాడుకోవచ్చు’ అనే మెసేజ్ కనిపిస్తోంది.
వాబెటాఇన్ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్ ‘మల్టీ-డివైస్ 2.0’లో పనిచేయడం ప్రారంభించింది. వినియోగదారులు త్వరలో తమ ఐప్యాడ్‌ను కొత్త లింక్డ్ డివైజ్‌గా ఉపయోగించగలరు. ఆండ్రాయిడ్ మొబైల్స్‌లోనూ ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ వినియోగదారులను నాలుగు డివైజ్‌లు సహా ఓ స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అంటే ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో లాగిన్ కావచ్చన్నమాట. అంతేకాదు నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ మిగిలిన నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్ వినియోగించుకోవచ్చు. ఒకవేళ వరుసగా 14 రోజులపాటు మొబైల్ మిగతా నాలుగు డివైజ్‌లతో కనెక్ట్ కాకపోతే వాటిలోంచి వాట్సాప్ ఆటోమేటిగ్‌గా లాగవుట్ అయిపోతుంది. ఆ తర్వాత మరోసారి లింక్ అయితే మరో 14రోజుల పాటు వాడుకోవచ్చు.
అంతేకాకుండా వాబెటాఇన్పో తాజా నివేదిక ప్రకారం.. యాప్‌లో ‘మెసేజ్ రియాక్షన్స్’ ఫీచర్ జోడించడానికి వాట్సాప్ యోచిస్తోంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఐవోఎస్ వెర్షన్‌లో కనిపించగా ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.21.20.8 బీటాలో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ఇన్‌స్టాగ్రామ్ ‘మెసేజ్ రియాక్షన్’ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఉంటుంది. వాట్సాప్ వినియోగదారులు ఎమోజి ఐకాన్స్‌తో మెసేజ్‌లకు ప్రతిస్పందించవచ్చు. మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా యాప్ కొన్ని ఎమోజీలను ప్రదర్శిస్తుంది. అప్పుడు మీకు ఇష్టమైనది ఎంచుకుని అవతల వారికి పంపిచొచ్చు.