- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వాట్సాప్‌లో ‘మదర్స్ డే’ స్పెషల్ స్టిక్కర్స్
దిశ, ఫీచర్స్: ఒకే ఒక్క పదం.. ఒకే ఒక్క రూపం.. ఈ ప్రపంచంలోని బాధలను దూరం చేసి, సంతోషాన్ని గోరుముద్దులుగా చేసి పెడుతోంది. ప్రేమకు కొలమానం, త్యాగానికి ప్రతిరూపం, నిస్వార్థానికి నిలువెత్తు నిదర్శనం ‘అమ్మ’. ప్రతిరోజూ ‘అమ్మ’దే అయినా..ఆమెను పూజించుకోవడానికి, ఆరాధించడానికి, మన ప్రేమను చాటుకోవడానికి ఏటా మే 9న ‘మాతృదినోత్సవం’ జరుపుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ‘మదర్స్ డే’ సందర్భంగా వాట్సాప్ కొత్త స్టిక్కర్ ప్యాక్‌ను విడుదల చేసింది. ‘మామా లవ్’ పేరుతో రిలీజైన ఈ కొత్త వాట్సాప్ స్టిక్కర్ ప్యాక్ ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లలో లభిస్తుంది. ఆ స్టిక్కర్ ప్యాక్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?
మదర్స్ డే స్టిక్కర్ కలెక్షన్‌లో మొత్తం 11 స్టిక్కర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా యానిమేటెడ్ స్టిక్కర్లే. కొత్త స్టిక్కర్ ప్యాక్ వాట్సాప్‌లో అందుబాటులో ఉండగా, దీన్ని స్టిక్కర్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి, మొదట వాట్సాప్‌లో చాట్ ఓపెన్ చేసి ఎమోజి బటన్‌పై క్లిక్ చేయాలి. బాటమ్ ట్రే నుంచి, స్టిక్కర్ ఐకాన్ ఎంచుకుని ‘+’ బటన్‌పై ట్యాప్ చేయగానే వాట్సాప్ స్టిక్కర్ స్టోర్ కనిపిస్తుంది. అక్కడ ‘మామా లవ్’ స్టిక్కర్ ప్యాక్ ఉంటుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ బంధుమిత్రులకు మదర్స్ డే స్పెషల్ విషెష్ తెలియజేయొచ్చు. ఇదేగాక మరో పద్ధతిలోనూ వీటిని యాడ్ చేసుకోవచ్చు. మదర్స్ డే స్టిక్కర్ ప్యాక్‌ను లైబ్రరీకి యాడ్ చేయాలంటే.. స్టిక్కర్‌పై ఎక్కువసేపు క్లిక్ చేసి ‘యాడ్ టు ఫేవరెట్’ను సెలెక్ట్ చేసుకుంటే సరి.
పండుగ సందర్భాల్లో కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను అందించే వాట్సాప్.. వినియోగదారులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇటీవలే ‘ఎర్త్ డే’ స్టిక్కర్ ప్యాక్‌ను అందించడంతో పాటు రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ వారం ప్రారంభంలోనే ఆరు కొత్త స్టిక్కర్ ప్యాక్‌లను విడుదల చేసింది. అంతేకాదు స్టిక్కర్ సెర్చ్‌ను సులభతరం చేసే ఫీచర్‌పై కూడా వాట్పాప్ పనిచేస్తోంది. ఇది చాట్ బార్‌లో మీరు టైప్ చేసిన పదాల ఆధారంగా స్టిక్కర్‌ల కోసం సూచనలను చూపుతుంది. మీ లైబ్రరీలో టైప్ చేసిన పదానికి సంబంధించిన స్టిక్కర్లు ఉంటే, వాట్సాప్ వీటిని సూచిస్తుంది కాబట్టి మీరు దీన్ని సులభంగా చాట్స్‌లోనూ షేర్ చేసుకోవచ్చు.