Allegro Micro System: తెలంగాణలో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఆర్ అండ్ డీ సెంటర్

by Prasad Jukanti |   ( Updated:2024-11-15 07:13:35.0  )
Allegro Micro System: తెలంగాణలో అలెగ్రో మైక్రో సిస్టమ్ ఆర్ అండ్ డీ సెంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామన్నారు. అలెగ్రో మైక్రో సిస్టమ్ (Allegro Micro System) తో శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ (MOU) కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబుతో ఆ సంస్థ సీఈవో వినీత్ నేతృత్వంలోని సంస్థ ప్రతినిధుల బృందం శుక్రవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అవగాహన ఒప్పందానికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ సీఈవోతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ లకు సంబంధించి ఆర్అండ్ డీ (R&D Centre) సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుతో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు అలెగ్రో మైక్రో సిస్టమ్స్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed