- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Lokesh: మెగా డీఎస్సీపై అసెంబ్లీలో మంత్రి లోకేశ్ కీలక ప్రకటన..
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ (Mega DSC)పై మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఆసెంబ్లీ (Assembly)లో మాట్లాడుతూ.. వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి డీఎస్సీ రిక్రూట్‌మెంట్ (DSC Recruitment) ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్ (DSC Notification) విడుదలలో కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయని.. వాటిని క్లియర్ చేసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో టీచర్లపై పెట్టిన కేసులను కూడా తమ ప్రభుత్వం ఎత్తివేస్తుందని భరోసానిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాల పర్యవేక్షణకు కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై వేధింపులు ఉండవని అన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) డీఎస్సీ (DSC) అభ్యర్థులను నమ్మించి మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అదేవిధంగా అభ్యర్థుల వయసు మినహాయింపు విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu)తో త్వరలోనే చర్చిస్తామని.. జీవో నెం.177కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.