- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపు అడ్మిన్‌లకు.. వాట్సాప్ గుడ్‌న్యూస్
దిశ, ఫీచర్స్: వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్స్ అందిస్తుంటుంది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం వ్యక్తిగత చాట్స్‌కు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు గ్రూప్ అడ్మిన్‌కు కూడా ఈ ఫెసిలిటీ అందించనుంది. బల్క్ మెసేజ్‌లు, ఫొటోలతో విసుగు చెందిన అడ్మిన్‌లకు ఇదో గుడ్ న్యూస్ కాగా, దీని విశేషాలేంటో తెలుసుకుందాం.
‘డిజప్పియరింగ్ మెసేజెస్’పై ఇప్పటివరకు గ్రూప్ అడ్మిన్స్‌కు ఎలాంటి కంట్రోల్ లేదు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ న్యూ బీటా వెర్షన్‌లో కొంతమంది గ్రూప్ అడ్మిన్స్‌కు మాత్రం దీన్ని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసే అవకాశాన్ని వాట్సాప్ పరిశీలిస్తోంది. కాగా బీటా వినియోగదారుల్లో కొంతమంది ఇప్పటికే ఈ ఫీచర్‌ను వాడుతున్నారు. అయితే గ్రూప్ అడ్మిన్లు అనుమతిస్తే గ్రూప్ మెంబర్స్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఏదైనా వాట్సప్ గ్రూప్‌లో డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఆన్ చేశారంటే ఆ గ్రూప్‌లోని మెసేజెస్ అన్నీ వారం రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా మాయమైపోతాయి. అంతేకాదు 24 గంటల తర్వాత సందేశాలను ఆటోమేటిక్‌గా తొలగించే అవకాశాన్ని కూడా వాట్సాప్ పరీక్షిస్తోంది.
మీరు అడ్మిన్ అయితే.. గ్రూప్ చాట్‌లో అదృశ్యమైన సందేశాలను ఆన్ చేయవచ్చు. అందుకోసం వాట్సాప్ గ్రూప్ చాట్ ఓపెన్ చేసి, గ్రూప్ నేమ్ ట్యాప్ చేయాలి. అక్కడ ‘డిజప్పియరింగ్ మెసేజెస్’పై క్లిక్ చేసిన తర్వాత ప్రాంప్ట్ చేసి కంటిన్యూ బటన్ నొక్కాలి. ఇక మెసేజ్ డిజప్పియర్ కాకముందే యూజర్ బ్యాకప్ చేసుకునే అవకాశముంది. వాట్సాప్ చాట్ హిస్టరీ మైగ్రేషన్ ఫీచర్‌ను కూడా పరీక్షిస్తుండగా.. ఇది వినియోగదారులు వారి చాట్ హిస్టరీని ఆండ్రాయిడ్ నుంచి iOSకు, ఐవోఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుంది.