- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె అంటే నాకు చాలా ఇష్టం.. సైఫ్ తల్లి
దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ తల్లి, వెటరన్ యాక్ట్రెస్ షర్మిళ ఠాగూర్.. కోడలు కరీనాను చాలా ఇష్టపడుతుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హ్యాపీ మూమెంట్స్‌ను పంచుకునే ఈ అత్తాకోడళ్లు, తమ క్లోజ్‌నెస్‌ను ఈ విధంగా రివీల్ చేస్తుంటారు. అయితే ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల్లో కరీనాపై ఇష్టాన్ని షేర్ చేసుకున్న సైఫ్ తల్లి.. లేటెస్ట్ ఇంటర్వ్యూలోనూ తనను పొగడ్తలతో ముంచెత్తింది. ‘కరీనా అంటే నాకు చాలా ఇష్టం. తనలో దాగివున్న అద్భుతమైన విషయం ఏమిటంటే.. ఆమె ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. స్టాఫ్, హెయిర్ డ్రెస్సర్, డిజైనర్‌తో ఇంటరాక్ట్ అయ్యే విధానం ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజానికి అంత ప్రశాంతంగా ఉండటం నా వల్ల కాదు. బెబో ఓపికను చూసి ఎవరైనా ఇష్టపడతారు’ అని పేర్కొంది.
అంతేకాదు కరీనా ప్రజెన్స్ తనను కామ్‌గా ఉంచుతుందని చెప్పిన షర్మిళ.. కరీనా మాత్రం ఎవరితోనూ పోల్చుకోదని, సొంత ఐడెంటిటీని నిలుపుకునేందుకే ప్రయత్నిస్తుందని వెల్లడించింది. తను కోడలుగా రావడం అదృష్టంగా పేర్కొంది. ఇక నేను కూడా మీ కూతురినే అని కరీనా ఎప్పుడూ చెబుతూ ఉంటుందని.. ‘అవును నిజమే’ అంటుంటానని చెప్పుకొచ్చింది షర్మిళ.