మా ఎలక్షన్స్ పై ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. షాక్ లో ఇండస్ట్రీ?

by Anukaran |   ( Updated:2021-10-05 01:20:54.0  )
మా ఎలక్షన్స్ పై ఎన్టీఆర్ సంచలన నిర్ణయం.. షాక్ లో ఇండస్ట్రీ?
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారుతోన్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఘాటు విమర్శలు చేస్తూ చిత్ర పరిశ్రమలో మంటలు పుట్టిస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్, మంచు విష్ణు ప్యానెల్ తన ప్రచారాలను వేగవంతం చేశారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుండగా, మంచు విష్ణు పలువురు ప్రముఖుల సపోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి కలిసి వస్తున్నాడు. కృష్ణ, కృష్ణంరాజు, నరేష్ వంటి వారిని విష్ణు కలిసిన విషయం తెలిసిందే. మరోపక్క సినీనటి జీవిత నరేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఆమె ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. మా ఎలక్షన్స్ పై జూనియర్ ఎన్టీఆర్ అన్న మాటలను బయటపెట్టారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారడంతో పాటు ఇండస్ట్రీలో కలకలం రేపుతోన్నాయి.

ఇటీవల తాను ఒక పార్టీలో ఎన్టీఆర్ ని కలవడం జరిగిందని, ఎలాగూ కలిశాం కదా అని తాను మా ఎలక్షన్స్ లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న విషయం ఆయనకు చెప్పానని చెప్పారు. అనంతరం ఆయనను తనకు ఓటు వేయాల్సిందిగా కోరానని, కానీ ఎన్టీఆర్ మాత్రం అసలు తాను ఓటు వేయడానికి కూడా రానని చెప్పడంతో షాక్ అయ్యానని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తోందని, ఓటు వేసేందుకు రాలేనని, తప్పుగా అనుకోవద్దని తెలిపినట్లు జీవిత పేర్కొన్నారు. ఎన్టీఆర్ మాటల్లో వాస్తవం లేకపోలేదని, ఆయన అన్నట్లుగానే ప్రస్తుత పరిస్థితులు ఏమంత బాలేవని , అందుకే ఓటు కూడా అడగొద్దని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక నటుడిగా ఓటు వేయాల్సిన బాధ్యత ఉండి, ఓటు అడగొద్దు, నేను ఓటు వేయను అని ఎన్టీఆర్ అనడం వెనక ఉద్దేశ్యం ఏంటి..? అని అభిమానులతో పాటు ఇండస్ట్రీ పెద్దలు కూడా షాక్ అవుతున్నారు.

Advertisement

Next Story