‘వెరిఫికేషన్ అప్లికేషన్ ప్రొగ్రామ్’‌ పున: ప్రారంభం : Twitter

by Shyam |
‘వెరిఫికేషన్ అప్లికేషన్ ప్రొగ్రామ్’‌ పున: ప్రారంభం : Twitter
X

దిశ, ఫీచర్స్ : మూడేళ్ల విరామం తర్వాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తన వెరిఫికేషన్ అప్లికేషన్ ప్రొగ్రామ్ (ధ్రువీకరణ దరఖాస్తు కార్యక్రమం)ను ప్రజల కోసం తిరిగి ప్రారంభించింది. రీఓపెనింగ్ అప్లికేషన్స్‌తో పాటు, ప్రొఫైల్స్ ఎలా ధ్రువీకరిస్తారో నిర్దేశించే మార్గదర్శకాలలో మార్పులను కూడా ట్విట్టర్ ప్రకటించింది. అంతేకాదు ధ్రువీకరించిన ప్రొఫైల్స్ యూజర్స్ ఎలా నిర్వహించాలో తెలిపే ప్రాథమిక నియమ నిబంధనలను వెల్లడించింది. ప్రస్తుతం ట్వీపుల్స్(ట్విట్లర్ యూజర్స్) “బ్లూ టిక్”ను ఎలా పొందగలరు? పున: ప్రారంభించిన ప్రోగ్రామ్‌లో కొత్తదనం ఏమిటి?

ట్విట్టర్ ‘వెరిఫికేషన్ ప్రొగ్రామ్’ ఏకపక్షంగా, గందరగోళంగా ఉందని ట్వీపుల్స్ నుంచి వచ్చిన విమర్శల తర్వాత ట్విట్టర్ ఈ బ్లూ చెక్ మార్కులను 2017‌లో పబ్లిక్ సబ్‌మిషన్‌ను నిలిపివేసింది. తిరిగి మూడు సంవత్సరాల తర్వాత ట్విట్టర్ మరోసారి ధ్రువీకరణ ప్రక్రియను గురువారం ప్రారంభించినట్లు తెలిపింది. రాబోయే కొద్ది వారాల్లో ఇది ప్రారంభమవుతుందని, 199 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో 3,60,000 ఖాతాలు మాత్రమే ధ్రువీకరించామని ట్విట్టర్ పేర్కొంది.

ట్విట్టర్ కొన్ని వర్గాల వినియోగదారుల(సర్టయిన్ క్యాటగిరీస్ యూజర్స్)ను పోర్టల్‌లో ధ్రువీకరించడానికి అనుమతిస్తుంది. ట్విట్టర్ ప్రకారం, అధిక ప్రజా ప్రయోజనం ఉన్న ఖాతాల ప్రామాణికత(అథెంటిసిటీ ఆఫ్ అకౌంట్స్)ను సాధారణ అకౌంట్స్‌ల నుంచి వేరు చేయగల మార్గాలలో ‘బ్లూ బ్యాడ్జ్’ ఒకటి. ఇది ట్విట్టర్‌లోని వ్యక్తులు, ఎవరితో సంభాషణలు జరుపుతున్నారనే దాని గురించి మరింత సమాచారం అందిస్తుంది. దాంతో ఇది నమ్మదగిందా? కాదా అని ట్విట్టర్ నిర్వాహకులు నిర్ధారిస్తారు. దీనివల్ల ఆరోగ్యకరమైన, మరింత సమాచార సంభాషణలకు ఇది ఉపయోగపడుతుందని ట్విట్టర్ వెల్లడించింది.

రాబోయే కొద్ది వారాల్లో, ట్విట్టర్‌లోని ప్రతి ఒక్కరూ న్యూ వెరిఫికేషన్ అప్లికేషన్‌ను నేరుగా అకౌంట్ సెట్టింగ్‌ల ట్యాబ్‌లో చూస్తాం. ఈ అప్లికేషన్ సమర్పించిన తర్వాత, వినియోగదారుడికి కొద్ది రోజుల్లోనే ట్విట్టర్ నుంచి ఈ మెయిల్ రిప్లయ్ వస్తుంది. అప్లికేషన్ ఆమోదిస్తే, వినియోగదారుడు వారి ప్రొఫైల్‌లో బ్లూ టిక్‌ని చూడొచ్చు. ఒకవేళ వెరిఫికేషన్‌‌కు సదరు యూజర్ అభ్యర్థన తిరస్కరిస్తే, 30 రోజుల తర్వాత తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అప్లికేషన్ లాంచ్‌తో పాటు, ధ్రువీకరించిన ఖాతాల కోసం ట్విట్టర్ కొత్త మార్గదర్శకాలను కూడా ప్రవేశపెడుతోంది.

ధ్రువీకరణకు అర్హత సాధించడానికి..

ట్విట్టర్ ఖాతాలు..

ప్రభుత్వం.. కంపెనీలు, బ్రాండ్లు
సంస్థలు.. వార్తా సంస్థలు, పాత్రికేయులు
వినోదం.. క్రీడలు, గేమింగ్
కార్యకర్తలు, నిర్వాహకులు / ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు వంటి ఈ ఆరు వర్గాలలో ఒకదానికి చెందిన వారై ఉండాలి. అయితే, ఈ ఏడాది చివర్లో శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మత పెద్దలు వంటి మరిన్ని వర్గాలను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం యూజర్లు తప్పనిసరిగా ప్రొఫైల్ పేరు, ప్రొఫైల్ ఇమేజ్, ధ్రువీకరించిన ఈ-మెయిల్ చిరునామా లేదా ఫోన్ నంబర్‌ను కూడా అందించాలని చెప్పారు. ఖాతా కూడా గత ఆరు నెలల్లో యాక్టివేట్‌లో ఉండాలి. ట్విట్టర్ నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు రికార్డ్ కలిగి ఉండాలి.

మూడేళ్ల క్రితం ఈ వెరిఫికేషన్ ప్రొగ్రామ్ నిలిపివేయగా, గత కొంతకాలం నుంచి ట్విట్టర్ తన ధ్రువీకరణ విధానాన్ని సవరించడానికి వినియోగదారుల నుంచి అభిప్రాయాన్ని కోరుతోంది. ముఖ్యంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగాన్ని నియంత్రించడానికి కేంద్రం మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన సోషల్ మీడియా నిబంధనల ప్రకారం తమ ఖాతాలను ధ్రువీకరించాలనుకునే వారికి వలంటరీ వెరిఫికేషన్ మెకానిజమ్ అందించే ప్లాట్‌ఫామ్స్ ఉండాలని పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ దీన్ని పున: ప్రారంభించింది.

Advertisement

Next Story