- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రశ్నిస్తూ నటించడమా.. నటిస్తూ ప్రశ్నించడమా?
ప్రశ్నించేందుకు పాలిటిక్స్‌లోకి వచ్చానన్న పవర్‌స్టార్ ఇప్పుడు నటించేందుకు సినిమాల్లోకి వెళ్లాడు. ప్రజాసమస్యలపై ప్రజలతో మమేకమై ప్రజల మధ్యే ఉంటూ సినిమాల్లోకి వెళ్లనని ప్రకటనలు చేసిన పవన్.. తనను నమ్ముకున్న వాళ్లను ఆదుకునేందుకే ఇప్పుడు సినిమాలంటూ యూటర్న్ తీసుకున్నారు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని తన మనసు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉండేందుకు ఇష్టపడుతుందని చెప్పిన ఆయన పార్టీ పెట్టి పాలిటిక్స్‌లో సెటిల్ అయ్యాడు. ఈక్రమంలోనే తన వ్యూహాలు స్పీడప్ చేస్తున్నాడనుకున్న టైంలో ఒక్కవారంలోనే బీజేపీతో పొత్తు, సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బుల కోసమే రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ మూవీస్ హిట్టైతే ఓకే, మరి ఫట్ అయితే పరిస్థితి ఏంటన్నది పాలిటిక్స్‌లో వినపడుతున్న ప్రశ్న.
2019 ఎలక్షన్స్‌కు ముందు సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి.. మూడు అట్టర్ ప్లాప్ సినిమాలను మూటగట్టుకున్న పవన్ వాటి రివేంజ్ తీర్చుకునేందుకు ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ మూడు సినిమాలకు ఆశించినంత రాలేకపోయిన పైసలను ఈ మూడు సినిమాల ద్వారా సంపాదించాలని పవన్ ఫిక్సైనట్లే కనపడుతోంది. ఈ మూడు సినిమాలతో వచ్చిన డబ్బులను త్వరలో ఎలక్షన్లలో బహిరంగ సభలు, పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగించేందుకు ప్లాన్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకుల నుంచి వినపడుతున్న మాట. ఈ మూడు సినిమాలే కాక త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో మరో రెండు నెలల్లో దాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లి సినిమాలు, రాజకీయాలు చేస్తూ ప్రజలను ఉత్సాహ పరుస్తూ ఉండాలని పవన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
కానీ ఓవైపు అందరూ పవన్ సినిమాలపై పాజిటివ్‌గానే ఆలోచిస్తూ పైసలు రావాలని కోరుకుంటున్నా మరోవైపు మాత్రం భిన్నమైన వాదనలు వినపడుతున్నాయి. ఇతర భాషల్లో హిట్టైన పింక్ సినిమా కథలో మళ్లీ మార్పులు చేసి పట్టాలెక్కిస్తున్నారని అది ఎంతవరకు అభిమానులు ఆదరిస్తారని అనుమానిస్తున్నారు. దీంతోపాటు క్రిష్‌తో సినిమా, హరీశ్ శంకర్ సినిమాలు ఏవిధంగా ప్రజలను మెప్పిస్తాయన్నది కూడా చర్చకు వస్తోంది. గతంలో మూడు సినిమాలు ఎంతో హైప్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్ల పడటంతో ఈ మూడు సినిమాల ఫలితాలు కాస్త అటు ఇటు అయితే సినిమా భవిష్యత్‌తో పాటు రాజకీయ భవిష్యత్ ఏంటని పార్టీ శ్రేణులతో పాటు ఫ్యాన్స్ నుంచి నుంచి వినపడుతున్న మాట.