- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఓ అంటే ఏమిటి…?
దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో స్టాక్ మర్కెట్‌లో ఐపీఓల సందడి ఎక్కువగా ఉంది. చాలా మందికి ఈ ఐపీఓ అంటే ఏంటో తెలియదు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఓ అంటే ప్రారంభ పబ్లిక్ ఆఫర్(IPO). ఒక ప్రైవేట్ కంపెనీ తన షేర్లను సాధారణ ప్రజలకు విక్రయించడానికి స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడాన్ని ఐపీఓ అంటారు. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా ఒక ప్రైవేటు కంపెనీ లేదా కార్పొరేషన్ తన వాటా లో కొంత భాగాన్ని పెట్టుబడిదారులకు విక్రయించడం ద్వారా పబ్లిక్‌గా మారే ప్రక్రియ. సాధారణ ప్రజలకు కూడా కంపెనీలో పెట్టుబడులను అనుమతించడం ద్వారా ప్రజల నుండి మూలధనాన్ని సేకరించవచ్చు. IPO సాధారణంగా సంస్థకు కొత్త ఈక్విటీ(వాటా) మూలధనాన్ని అందించడానికి, ఇప్పటికే ఉన్న ఆస్తులను ట్రేడింగ్ చేయడానికి, భవిష్యత్తు కోసం మూలధనాన్ని సమీకరించడానికి లేదా ఇప్పటికే ఉన్న వాటాదారులు చేసిన పెట్టుబడులను మోనటైజ్ చేయడానికి ప్రారంభించబడుతుంది.
IPOలో కంపెనీలు తమ షేర్ల ధరలను ప్రకటిస్తాయి. అత్యల్ప షేరు ధర అత్యధిక షేరు ధర అని రెండు రకాలుగా ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్ కలిగిన వారు షేర్లను అమ్మడం, కొనడం చేయవచ్చు. షేరును కొనాలనుకునేవారు రెండు ధరలలో ఏ ధర వద్ద అయిన బిడ్లు దాఖలు చేయవచ్చు. ఐపీఓ పూర్తయిన తర్వాత, సంస్థ షేర్లు మార్కెట్‌లో లిస్ట్ చేయబడుతాయి. బిడ్‌లో షేరు అలోట్‌మెంట్ అయిన వాళ్ళు కంపెనీ ట్రెడింగ్‌లో పాల్గొనవచ్చు.