బ్రేకింగ్: మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్

by Anukaran |   ( Updated:2021-04-04 08:07:17.0  )
బ్రేకింగ్: మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి కర్ఫ్యూతో పాటు వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ప్రతి వారం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు వీకెండ్ లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని వెల్లడించింది.

ఇక ప్రతిరోజూ రాత్రి 8 నుంచి తర్వాతి రోజు ఉదయం 7 గంటలకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. రాత్రి కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. థియేటర్లు, పార్కులు, ప్లే గౌండ్స్ కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆఫీసులు 50 శాతం మంది సిబ్బందితో పనిచేస్తాయంది. రెస్టారెంట్లలో సీటింగ్‌కు అనుమతి లేదని, టేక్ అవేకు మాత్రమే అనుమతి ఉంటుందంది. ఈ రూల్స్ రేపటి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed