బుధవారం పంచాంగం, రాశిఫలాలు ( 28-04-2021)

by Hamsa |   ( Updated:2021-04-27 11:29:16.0  )
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం

తిధి : పాడ్యమి ఉ 7.29
తదుపరి విదియ తె4.58
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : విశాఖ రా8.07
తదుపరి అనూరాధ
యోగం : వ్యతీపాతం సా6.38
తదుపరి వరీయాన్
కరణం : కౌలువ ఉ 7.29
తదుపరి తైతుల సా 6.13
ఆ తదుపరి గరజి తె 4.58
వర్జ్యం : రా 11.50 – 1.19
దుర్ముహూర్తం : ఉ 11.31 – 12.21
అమృతకాలం : ఉ 11.55 – 1.24
రాహుకాలం : మ 12.00 – 1.30
యమగండం/కేతుకాలం : ఉ 7.30 – 9.00
సూర్యరాశి : మేషం || చంద్రరాశి : తుల
సూర్యోదయం : 5.40 || సూర్యాస్తమయం: 6.14

మేషం : బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. భాదిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది . పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు.

వృషభం : జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.

మిధునం : కీలక సమయంలో సన్నిహితులు సాయం అందుతుంది ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు, కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి .ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది.

కర్కాటకం : కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

సింహం : నూతన రుణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి.

కన్య : ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు పొందుతారు.

తుల : బంధుమిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికం ఫలితం తక్కువగా ఉంటుంది.

వృశ్చికం : ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

ధనస్సు : సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారం నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం : చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు.

కుంభం : ఆకస్మిక ధన లాభం పొందుతారు. కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం : ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

Advertisement

Next Story