- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
దిశ, వెబ్‌డెస్క్: గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తాకిడి భారీగా పెరిగిపోయింది. దీంతో పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశంలో మేఘాలు ఉన్పటికి వర్షాలు మాత్రం ఎక్కడో ఒక చోట మాత్రమే కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో ఈ రోజు ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆటు ఏపీ, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ అల్పపీడనం కారణంగా రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ అయింది. దీంతో పాటు.. తెలంగాణలోనూ రానున్న 4 రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదిలా ఉండే శుక్రవారం సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. వరద కారణంగా కీలక మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.