‘అవసరమైతే గ్రామానికో కొనుగోలు కేంద్రం’

by Shyam |
‘అవసరమైతే గ్రామానికో కొనుగోలు కేంద్రం’
X

దిశ, వరంగల్: జిల్లాకు ధాన్యం విపరీతంగా వచ్చే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల సమస్యలు రాకుండా అవసరం అయితే గ్రామానికో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలో కలెక్టర్ నిఖిల, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి కూరగాయల దుకాణాలు, కిరాణం దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులకు రాకుండా ఉండాలనే అధికారులు, పోలీసులు, ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజాప్రతినిదులు, సర్పంచులు అందరూ ముందుకు వచ్చి వారి ఒక నెల వేతం సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ లారీలకు, అధికారులకు, పాలు, పేపర్ బాయ్‌లకు
‌మీడీయాకు పాసులు ఇస్తున్నామన్నారు.ఎన్ని ఇబ్బందులు ఉన్న మన జీవితాలు మన కాపాడుకోవాలని, ఈ రోగాన్ని దరిదాపులకు రాకుండా ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.

Tags : Centers for purchase, WARANGAL, JANAGAMA,COLLECTOR, MINISTER ERRABELLI

Advertisement

Next Story

Most Viewed