జూన్‌లో 10 కోట్ల డోసులు అందిస్తాం.. కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన సీరం

by Shamantha N |
జూన్‌లో 10 కోట్ల డోసులు అందిస్తాం.. కేంద్ర ప్రభుత్వానికి తెలిపిన సీరం
X

ముంబై: అతిపెద్ద టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా జూన్ నెలలో 10 కోట్ల కొవిషీల్డ్ టీకా డోసులను ఉత్పత్తి చేసి సరఫరా చేయగలదని తెలిపింది. జూన్‌లో తొమ్మిది నుంచి పది కోట్ల డోసులను సరఫరా చేస్తామని సీరం ప్రభుత్వ, రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ వివరించారు. కరోనా కారణంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ తమ ఉద్యోగులు నిరంతరం పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

టీకా తయారీ, ప్రజలకు అందుబాటులో ఉంచడంలో దేశాన్ని ఆత్మనిర్భర్ చేయడానికి సహకరించిన అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ నెలలో తాము తొమ్మిది నుంచి 10 కోట్ల డోసులు సరఫరా చేయగలమని వివరించారు. మే నెలలో సీరం 6.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యముండగా ప్రస్తుతం దాన్ని మరింత పెంచుకుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed