ఈనెలాఖరుకు పీఆర్సీ చెల్లిస్తాం

by srinivas |
Sajjala
X

దిశ, ఏపీ బ్యూరో: ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో సంక్షేమ పథకాల అమలును తమ భుజస్కంధాలపై వేసుకున్నారని కొనియాడారు. సచివాలయంలో బుధవారం సీఎంఓ అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చల్లో సజ్జల పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ ఉద్యోగుల భద్రతలో సీఎం వైఎస్‌ జగన్‌ రెండడుగుల ముందే ఉంటారని వెల్లడించారు. ఉద్యోగులకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. సుధీర్ఘంగా ఉన్న ఆర్టీసీ డిమాండ్లను సీఎం జగన్‌ నెరవేర్చారని గుర్తు చేశారు. ఉద్యోగులను రాజకీయాల కోసం వాడుకోవడాన్ని ముఖ్యమంత్రి సహించరని వ్యాఖ్యానించారు.

కరోనా తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. ఆ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. పీఆర్సీ వంటి సమస్యలపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి రాగానే 27శాతం ఐఆర్ హామీ సీఎం జగన్ నెరవేర్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వంటివి ఎన్నో కార్యక్రమాలను చేశామని తెలిపారు. ఈ నెలాఖరుకు పీఆర్‌సీతో సహా సమస్యలను పరిష్కరిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed