- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగురవేస్తాం : ఆర్ఎస్పీ
దిశ, కోదాడ : రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యం స్థాపిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెరిక హాస్టల్ భవన్లో కోదాడ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో పలువురు ఆ పార్టీ చేరారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు నీలి కండువా కప్పి ఆహ్వానించిన అనంతరం ఆర్ఎస్పీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం నాడు అమరుడైన శ్రీకాంతాచారి బహుజనుడు అని నీలి కండువాను రెపరెపలాడించిన వీరుడని అన్నారు. నీలి కండువా రాకతోనే రాష్ట్రంలో 30 లక్షల మందికి ఉపాధి దొరికిందన్నారు. ప్రజలను ద్వేషించకుండ పాలన చేస్తున్నారని, నీలి కండువా రాకతోనే అన్ని కులాల, మతాల వారికి న్యాయం జరుగుతుందన్నారు.
జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. నీలి కండువా అమ్ముడుపోని మడమతిప్పని త్యాగనిరతి గల పార్టీ అని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రగతి భవన్ పై నీలి కండువా ఎగరవేయడం ఖాయమన్నారు. ఏనుగు గుర్తును గ్రామగ్రామాన అన్ని వర్గాల వారికి చేరువ చేయాలని కార్యకర్తలను కోరారు. ఓట్లు మావి సీట్లు మీవా అని ఆయన ప్రశ్నించారు. ఓట్లు మావే సీట్లు మావే అని కార్యకర్తలతో కలిసి నినాదాలు చేశారు.
అంతకుముందు బీఎస్పీ కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో పట్టణ శివారు నుండి బైక్ ర్యాలీతో ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన హుజూర్ నగర్ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బహుజన్ సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ఇంచార్జి పగిడిమర్రి బాబురావు, దాసరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు చడపంగు రవి, జిల్లా మహిళా కన్వీనర్ బలుగురి స్నేహలత, నియోజకవర్గ కోశాధికారి కందుకూరి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి మామిడి రవి, సీనియర్ నాయకులు ఆర్. కుటుంబరావు, బి. రాజేందర్, కొండమీది కొండలు, పి. శ్రీనివాస్, కె.సోమయ్య, రెమిడాల లింగయ్య, దైద సురేందర్, కె.శ్రవణ్, బి.పుల్లయ్య, విజయ నిర్మల, పి.దశరథ, ప్రేమ్ కుమార్, సీహెచ్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.